NTV Telugu Site icon

Allu Sirish: మంచక్క కు ముద్దు.. తారక్ అన్నకు హగ్గు.. అదిరిందయ్యా శిరీష్

Lakshmi

Lakshmi

Allu Sirish: గౌరవం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్. ఇక మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు శిరీష్.. ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇక అల్లు అరవింద్.. పెద్ద కొడుకు అల్లు అర్జున్ స్టార్ హీరోగా మారాడు.. చిన్న కొడుకును కూడా హీరోగా నిలబెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. అయినా ఫలితం మాత్రం దక్కలేదు. ఇక ఈ మధ్యనే బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. ఒకప్పుడు శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవాడు. కానీ, మధ్యలో ఏమైందో ఏమో కానీ, చాలా రేర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. ఇక ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి ఇంట జరిగిన దీవాళీ సెలబ్రేషన్స్ లో అల్లు శిరీష్ సందడి చేశాడు.

Telugu OTT Update: ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన నందితా శ్వేత కొత్త సినిమా

ఇక ఈసారి సెలబ్రేషన్స్ లో శిరీష్ హైలైట్ గా మారాడు అంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం.. ఈ మధ్య మంచు లక్ష్మీ షేర్ చేసిన ఫోటో. ఆ ఫోటో దీవాళీ సెలబ్రేషన్స్ లో దిగినట్లు మంచక్క చెప్పుకొచ్చింది. ఇక అందులో మంచక్కకు ముద్దు పెడుతూ శిరీష్ కనిపించాడు. గత మూడు రోజుల క్రితం నుంచి ఈ ఫోటో ట్రోల్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు శిరీష్ ఒక అరుదైన ఫోటోను షేర్ చేసాడు. తారక్ ను కౌగిలించుకున్న ఫోటో షేర్ చేస్తూ.. ” స్నేహితులు, కుటుంబం లేదా అభిమానులు ఎవరైనా తారక్ అన్నను ఫోటో కోసం అడిగినప్పుడల్లా నాకు అదే ఆప్యాయత కనిపిస్తుంది. ఎంతో మంచి హృదయం కలవాడు” అంటూ రాసుకొచ్చాడు. ఈ ఫోటో కూడా దీవాళీ సెలబ్రేషన్స్ లోదే అని అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మంచక్క కు ముద్దు.. తారక్ అన్నకు హగ్గు.. అదిరిందయ్యా శిరీష్ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Show comments