Site icon NTV Telugu

Mega Family: చిరు ఫ్యామిలీలో మరో శుభవార్త.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న మెగా హీరో !

Allushirish

Allushirish

టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త రానుందన్న టాక్ ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇక మిగిలింది అల్లు శిరీష్ మాత్రమే. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శిరీష్ ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో కూడా బ్యాచిలర్ లైఫ్‌నే కొనసాగిస్తున్నారు. అభిమానులు ఆయన పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, తాజాగా ఆయన వివాహం గురించి హాట్ న్యూస్ బయటకొచ్చింది.

Also Read : Jathadhara : “జటాధార” కల్పిత కథ మాత్రమే.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

తాజా రిపోర్ట్స్ ప్రకారం, అల్లు శిరీష్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అల్లు కుటుంబంలో అదే కమ్యూనిటీకి చెందిన కోడలు రాబోతుందన్న గాసిప్ హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు అల్లు శిరీష్ గాని, అల్లు అరవింద్ గాని ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలోనూ ఆయన పెళ్లి, రిలేషన్‌షిప్‌ల గురించి అనేక రూమర్స్ వచ్చినా వాటిని శిరీష్ ఖండించారు. మరి ఈసారి ఈ వార్త నిజమవుతుందా? అల్లు ఫ్యామిలీలో మరోసారి పెళ్లి సంబరాలు జరుగుతాయా? అన్నది చూడాలి.

Exit mobile version