Allu Sirish: సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లిళ్లు చేసుకొని చక్కగా కాపురాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కొంతమంది పెళ్లికి ముందు ప్రేమలో ఉండి.. ఆ తర్వాత కొద్ది రోజులు డేటింగ్ చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు.. ఇక పెళ్ళైయ్యాక కొన్ని రోజులు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకున్న వారు ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇండస్ట్రీలో ఇదే ట్రెండ్ నడుస్తుంది.. అందులో అప్పటి సావిత్రి- జెమినీ గణేష్ నుండి ఇప్పటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వరకు ఉన్నారు.. ఇప్పుడు మరో హీరో కూడా అ బాటలో నడుస్తున్నాడు..
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటీనటులు పెళ్లి చేసుకుంటే ఎక్కువకాలం ఉండరు అని కొంతమంది నమ్మకం. కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసి ఉంటారు అనేది మరికొందరి నమ్మకం. నాగార్జున- అమల వంటి సెలబ్రీటిలను చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది.. వారి పెళ్ళై ఎన్నో ఏళ్లు గడిచిన ఇద్దరి మధ్య గొడవలు రాలేదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ బాటలోనే అల్లు శిరీష్ కూడా నడుస్తాడా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. గతంలో అల్లు శిరీష్.. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ప్రేమలో ఉన్నారని వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. మజ్ను సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన అను ఇమ్మానియేల్.. ఆ సినిమా తర్వాత నటించిన ఏ ఒక్క సినిమా కూడా అంతగా పేరు తెచ్చి పెట్టకపోయినప్పటికీ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.
ఇక అను ఇమ్మాన్యుయేల్ అల్లు శిరీష్ జంటగా నటించిన ఊర్వసివో రాక్షసివో సినిమా చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని వార్తలు వచ్చాయి, ఇక ఈ సినిమా కూడా అల్లు శిరీష్ కు అంతగా కలిసి రాలేదు.మరోపక్క ఈ జంట ఆ సినిమా తరువాత ఇప్పటివరకు బయట ఎక్కడా కనిపించింది లేదు. మరి ఇంకా అల్లువారబ్బాయి.. అనుతో ప్రేమయాణం సాగిస్తున్నాడా..? వరుణ్ లా సడెన్ గా తీసుకొచ్చి పెళ్లి ప్రేమ అని అయితే అనడుకదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే శిరీష్ సన్నహితుల నుంచి వస్తున్న మాట ఏంటంటే.. ప్రస్తుతం ఈ కుర్రాడు కెరీర్ మీదనే ఫోకస్ చేశాడని, ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
