NTV Telugu Site icon

Buddy: అల్లు శిరీష్”బడ్డీ” సినిమాకి స్పెషల్ ఆఫర్

Buddy

Buddy

Allu Shirish Buddy: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Also Read:TFPC Key Meeting: 8 వారాల తర్వాతే ఓటీటీలోకి.. తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం

ఈ నేపథ్యంలో “బడ్డీ” సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు మేకర్స్ ఈరోజు ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్ లో 99 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 125 రూపాయిలు మాత్రమే టికెట్ రేట్స్ ఉండబోతున్నాయి. “బడ్డీ” సినిమాకు మరింత ఎక్కువ మంది ఆడియెన్స్ ను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక కొత్త అటెంప్ట్ గా “బడ్డీ” సినిమా ఉండబోతోంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ అందించిన సాంగ్స్ ఇప్పటికే రిలీజై ఛాట్ బస్టర్స్ అయ్యాయి. “బడ్డీ” సినిమా ట్రైలర్ కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆగస్టు 2న రిలీజ్ కాబోతున్న “బడ్డీ” సినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

 

Show comments