Site icon NTV Telugu

MegaStar : అల్లు కనకరత్నం గారి నేత్రదానం ఎందరికో స్ఫూర్తి దాయకం

Chiru

Chiru

అల్లు రామలింగయ్య భార్య, శ్రీమతి అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. మనిషి పోయాక కాలి బూడిద అయిపోయే వాటిని ఇతరులకు దానం చేయడం మంచి విషయం. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని అప్పట్లో ఆమె మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మరణించిన తర్వాత ఆమె కళ్ళను దానం చేయాలనీ భావించి అల్లు అరవింద్ ని అడిగాను అందుకు ఆయన అంగీకరించారు. ఆమె కళ్ళను అల్లు కుటుంబం దానం చేసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలియజేశారు. ఆమె నేతృధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మెగాస్టార్ పేర్కొన్నారు.

Exit mobile version