Site icon NTV Telugu

Allu Aravind: ఆలీపై ఫైర్ అయిన అల్లు అరవింద్.. కాంట్రవర్సీ చేద్దామని పిలిచావా..?

Ali

Ali

Allu Aravind:టాలీవుడ్ బడా నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే అల్లు రామలింగయ్య స్టూడియోను నిర్మించి చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఇక ప్రస్తుతం సినిమాలు, నిర్మాణాలు, ఆహా ఓటిటీ బాధ్యతలతో తలమునకలవుతుండే అల్లు అరవింద్ మొదటి సారి ఒక టాక్ షోకు గెస్ట్ గా వచ్చాడు. అదే ఆలీ నిర్వహించే ఒక టాక్ షో లో అల్లు అరవింద్ తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టాడు. మొదటి నుంచి తనకు నటన మీద కంటే నిర్మాణ రంగంపైనే ఆసక్తి ఉందని చెప్పుకొచ్చాడు. అల్లు రామలింగయ్యతో తనకున్న అనుభందం గురించి చెప్తూనే తల్లి, భార్య గురించి మాట్లాడాడు. ఇక తాన్ ముద్దుల మనవరాలు అర్హ ఎంతో తెలివైందని చెప్పిన అల్లు అరవింద్ ఆమె గురించి తానే చెప్తే దిష్టి తగులుతుందని నవ్వేశారు.

ఇక ఇక్కడివరకు బాగానే ఉన్నా చివరగా ఒక ప్రశ్న అడిగినందుకు ఆలీపై ఫైర్ అయ్యాడు అల్లు అరవింది. గత కొన్ని రోజులుగా అల్లు  ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి.. దానిపై అని ఆలీ అంటుండగానే  అల్లు అరవింద్ అడ్డుపడి.. కొన్ని కాంట్రవర్షియల్ ఏమైనా అడుగుతాను అంటే వాటిని ముందు చెప్పండి అని  అన్నాను.. అబ్బే అవేమి లేవండీ.. సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉన్నాయి అని అన్నారు.. సర్ప్రైజింగ్ క్వశ్చన్ లో ఇదొకటా.. “అంటూ మండిపడ్డాడు. కాంట్రవర్సీ చేద్దామని పిలిచావా..? అన్నట్లు ఆలీపై అల్లు అరవింద్ మండిపడడంపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇలాంటి షోలలోనే నిజాలు చెప్పాలండీ.. అప్పుడే పుకార్లు రావు ఆ ఐ కొందరు అంటుండగా.. ఆలీ అడిగిన దాంట్లో తప్పేమి ఉందని మరికొందరు అంటున్నారు. మరి ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ ఎలాంటి సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

Exit mobile version