Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ ను సన్ పిక్చర్స్ పెడుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీకి బన్నీ ఇచ్చే ప్రియారిటీ గురించి తెలిసిందే. తాజాగా ఆయన ఫ్యామిలీతో దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ, ఆయన భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్, కూతురు అర్హ అందరూ బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిశారు. ఇందులో బన్నీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అలాగే స్నేహారెడ్డి కూడా ట్రెండీ లుక్ లో మెరిసింది.
Read Also : HHVM : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రిష్ వస్తాడా..?
ప్రస్తుతం అట్లీతో చేస్తున్న మూవీ షూట్ ముంబైలో జరుగుతోంది. దీన్ని భారీ సైంటిఫిక్ సినిమాగా తెస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా వీఎఫ్ఎక్స్ ను వాడుతున్నారు. దీన్ని కళానిధి మారన్ రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీపిక పదుకొణె హీరోయిన్ గా చేస్తోంది. ఇందులో మరో నలుగురు హీరోయిన్లు కూడా చేస్తారనే టాక్ వినిపిస్తుంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. విలన్ కోసం హాలీవుడ్ యాక్టర్ ను తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also : Allu Arjun : ప్రభాస్ దారిలో వెళ్తున్న అల్లు అర్జున్..?
