Site icon NTV Telugu

Allu Arjun : అల్లు అర్జున్ కు షాక్.. రోజుకు కోటిన్నర నష్టం..?

Allu Arjun, Atlee, Deepika Padukone

Allu Arjun, Atlee, Deepika Padukone

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు భారీ షాక్ తగిలిందా అంటే అవుననే అంటున్నారు సినిమా మేథావులు. మనకు తెలిసిందే కదా.. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయింది. భారీ షెడ్యూల్ ను ఇక్కడే ప్లాన్ చేశారు. అందుకే ముంబైలో భారీగా సెట్లు కూడా వేసేసి.. టెక్నీషియన్లు, ఆర్టిస్టుల డేట్లు తీసేసుకున్నారు. కానీ ఇదే టైమ్ లో టాలీవుడ్ లో సినీ కార్మికులు సమ్మెకు దిగారు. ఇప్పటికే 16 రోజులు అయిపోయాయి. మొదట్లో ఈ మూవీ షూటింగ్ కు కొంత మంది టెక్నీషియన్లు, కార్మికులు వచ్చారు. కానీ సమ్మె ఉధృతం కావడంతో ఈ మూవీ షూటింగ్ కు టాలీవుడ్ నుంచి ముందే మాట్లాడుకున్న వారెవరూ రావట్లేదని తెలుస్తోంది.

Read Also : Udaya Bhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ సినిమాకు నో.. ఉదయభానుపై ట్రోల్స్

ఆరు రోజులుగా షూటింగ్ ఆగిపోయింది. దీంతో రోజుకు కోటిన్నర చొప్పున 9 కోట్ల దాకా నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రోజు సమ్మెకు ముగింపు పలుకుతారనే ప్రచారం అయితే ఉంది. కానీ దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ నేటితో సమ్మె ముగిస్తే రేపటి నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు. షూటింగ్ ఆగిపోవడంతో ఫ్యామిలీతో గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ మీద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేశారంట. త్వరలోనే ఇందులో దీపిక కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇది భారీ సైంటిఫిక్ సినిమా అంటున్నారు. ఇంకొందరేమో పీరియాడిక్ సినిమా అని చెబుతున్నారు. ఈ మూవీ కోసం భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చారు.

Read Also : Vishwambhara : విశ్వంభర వాయిదా.. అనిల్ రావిపూడి ఫుల్ హ్యాపీ

Exit mobile version