ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఢిల్లీకి బయలు దేరగా ఆయన వెంట భార్య అల్లు స్నేహ కూడా ఉండడం గమనార్హం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. గత నెలలో ఈ జాతీయ అవార్డులను ప్రకటించగా ఈరోజు సాయంత్రం ఢిల్లీలో రిహారాల్స్ రేపు అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా జరగనుంది. నిజానికి తెలుగు నటుడు జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఇదే మొదటిసారి కావడంతో బన్నీ చరిత్ర సృష్టించారు. రేపు ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జాతీయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఉండడంతో ఆ వేడుకలో పాల్గొనేందుకు, జాతీయ అవార్డు అందుకునేందుకు బన్నీ ఢిల్లీ వెళ్లారు. ఆయన తన భార్య అల్లు స్నేహరెడ్డితో కలిసి వెళ్లగా ఎయిర్‌పోర్ట్ లో వీరి పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Anil sunkara: ఖరీదైన తప్పులు చేశా.. ఇక ఓపిక లేదంటున్న అనిల్ సుంకర
అల్లు స్నేహారెడ్డి వైట్ టాప్, బ్లూ జీన్స్ ధరించగా బన్నీ బ్లాక్ టీషర్ట్, కాజువల్ బ్లాక్ ప్యాంట్ ధరించారు. ఇక వీరితో పాటు `పుష్ప` టీమ్ కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. సుకుమార్, మైత్రీ నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ అవార్డు ప్రధానోత్సవ వేడుకలో పాల్గొనబోతున్నారు. మ్యజిక్ విభాగంలో డీఎస్పీకి జాతీయ అవార్డు వరించగా `పుష్ప 2` షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి టీమ్ అంతా బయలుదేరి వెళ్లారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో అత్యధికంగా తెలుగు సినీ పరిశ్రమకు పది అవార్డులు దక్కాయి. `ఆర్‌ఆర్‌ఆర్` కి ఆరు అవార్డులు దక్కగా, `పుష్ప`కి రెండు, `కొండపొలం` ఒకటి, `ఉప్పెన` ఒక అవార్డులు దక్కించుకున్నాయి. ఇక మొదటి సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాక అవార్డులు కూడా తెచ్చిపెట్టడంతో ఈ రెండో భాగం మీద భారీ అంచనాలు ఉన్నాయి.