NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ మార్ఫింగ్ ఫోటో.. ఛీ.. ఇంత దారుణమా

Bunny

Bunny

Allu Arjun: ఒక రంగంలో పనిచేసేవారి మధ్య పోటీ ఉండడం సహజమే. అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా పోటీ ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎప్పుడు కలిసే ఉంటారు. సినిమాలపరంగా పోటీ పెట్టుకుంటారేమో కానీ, వ్యక్తిగతంగా అందరు కలిసే ఉంటారు. ఈ విషయాన్ని అందరు హీరోలు ఎన్నోసార్లు రుజువు చేశారు. కానీ, హీరోలు కలిస్ ఉన్నట్లు హీరోల అభిమానులు కలిసి ఉండడం లేదు. అందువల్లే నెట్టింట నిత్యం ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉన్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ రక్తపాతాలు సృష్టించుకుంటున్నారు. మేము మేము ఒకటే.. మీరే మారాలి అని హీరోలు ఎన్నిసార్లు చెప్పినా వీరు మాత్రం మారడం లేదు. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ పేరుతో వీరు చేసే ఆగడాలు మాములుగా ఉండవు. హీరోల ఫోటోలను తీసుకొని ఇష్టం వచ్చినట్లు ఎడిట్ చేయడం, అసభ్యకరమైన పదజాలంతో దూషించడం.. హీరోల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆనందపడడం చేస్తూ ఉంటారు. దీనివలన నిజమైన హీరో అభిమానులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఎడిటింగ్, మార్ఫింగ్ ఫోటోలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియకుండా చేస్తున్నారు.

SlapKabaddi: ఏందయ్యా ఇది.. ఎప్పుడూ చూడలే..! వైరల్ అవుతున్న ఓ ఆట వీడియో..

తాజాగా అల్లు అర్జున్ మార్ఫింగ్ ఫోటోను కొంతమంది హీరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు. ఈ ఏడాది న్యూయర్ పార్టీకి అల్లు అర్జున్, కుటుంబంతో కలిసి గోవా వెళ్లిన విషయం తెల్సిందే. భార్య స్నేహరెడ్డి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో అక్కడ ఎంజాయ్ చేశాడు బన్నీ. అప్పుడు దిగిన ఒక ఫోటోను తీసుకొని ఎడిట్ చేసి.. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఒరిజినల్ ఫేస్ అని.. మిగతా హీరోల ఫ్యాన్స్ కామంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక నెటిజన్స్ ఇలా ఎడిట్ చేసిన వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దారుణం.. ఎందుకయ్యా ఇలాంటి బతుకు.. ఛీ.. సిగ్గుగా లేదు.. అంటూ ఏకిపారేస్తున్నారు. అర్ధం పర్థం లేకుండా ఇలా ఎడిట్స్ చేసి, మార్ఫింగ్ చేసి.. వాళ్ళని ఆడుకోవడం వలన మీకేం వస్తుంది. అది ఎప్పటిదో పిక్.. ఒరిజినల్ ఫోటోలో బన్నీ బాగానే ఉన్నాడు. ఇలా ఎడిట్ చేసి.. ట్రోల్ చేస్తున్నారు.. వీరిపై కూడా కేసు పెట్టాలంటూ బన్నీ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Show comments