NTV Telugu Site icon

Allu Arjun: ఆహాను టేకోవర్ చేసిన అల్లు అర్జున్.. హోస్ట్ గా గ్రాండ్ ఎంట్రీ..?

Allu Arjun

Allu Arjun

Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. బన్నీ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఈయన హోటల్ రంగంలో కి అడుగుపెట్టి విజయవంతంగా రెస్టారెంట్స్ ను నడిపిస్తున్నాడు. ఇక ఇంకోపక్క థియేటర్ రంగంలోకి అడుగుపెట్టి అల్లు అర్జున్ మల్టీఫ్లెక్స్ ను నిర్మించాడు. జూన్ 14 న ఈ థియేటర్ ఓపెన్ అవుతోంది. ఇక ఇవే కాకుండా ఆహా ఓటిటీని కూడా నడిపించే బాధ్యత తీసుకున్నాడు. మొదటి నుంచి కూడా అల్లు అరవింద్ తో పాటు ఆహా బిజినెస్ వ్యవహారాల్లో బన్నీ పాలుపంచుకుంటూ ఉంటాడు. ఆహా ను పైకి తీసుకెళ్లడానికి తనదైన శైలిలో ప్రయత్నిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆహా తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఆహాలో ఎటువంటి ప్రోగ్రాం కు గెస్ట్ గా రావాలి అన్న బన్నీ ముందు వాలిపోతారు. ఈ మధ్యనే తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ఫైనల్ కు బన్నీ గెస్టుగా హాజరయిన విషయం తెల్సిందే.

Deepti Bhatnagar: అక్కా.. ఎవరే అతగాడు అని పాడిన పాపనేనా.. ఈమె.. ఇలా మారిపోయిందేంటి

ఇకపోతే ఈసారి ఆహా.. బన్నీతో అంతకుమించి ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఆహా కోసం బన్నీ హోస్ట్ గా మారనున్నట్లు సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను త్వరలోనే మేకర్స్ అందివ్వనున్నారు. ఇక ప్రస్తుతం ఒక హింట్ ను మాత్రం వదిలారు. అదేంటంటే.. ఆహా ఒరిగినల్స్.. ప్రొడక్షన్ నెం 1 అంటూ బన్నీ పోస్టర్ తో కూడిన ఒక పోస్ట్ ను రిలీజ్ చేశారు. అందులో బన్నీ.. గన్ పట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక దీనికి క్యాప్షన్ గా.. ” ఆయన కలం నుంచి పుట్టే ఒక్కో మాట.. ఏకే 47 నుంచి వచ్చిన తూటాకన్నా పవర్ ఉంటుంది. మాటల్లో చెప్పలేని మాంత్రికుడు.. మీకు అర్ధమవుతుందా..? ఎవరో.. అంటూ రాసుకొచ్చారు. అంతే మొదటి గెస్ట్ త్రివిక్రమ్ అని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటివరకు పర్సనల్ ఇంటర్వ్యూ ఎవరికి ఇచ్చింది లేదు. బన్నీ, త్రివిక్రమ్ ను ఇంటర్వ్యూ చేసి ఆ పర్సనల్స్ అన్ని బయటికి లాగుతాడని అంటున్నారు. మరి అసలు ఈ పోస్టర్ ఏంటి..? దీని కథాకమీషు ఏంటి అనేది తెలియాలంటే.. మేకర్స్ చెప్పేవరకు ఆగాల్సిందే.

Show comments