NTV Telugu Site icon

Allu Arjun- Sukumar: ఈ కాంబో ఉంటుంది బాసూ.. వేరే లెవెల్ అంతే

Bunny

Bunny

Allu Arjun- Sukumar: చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబోలు ఉంటాయి. ఎంత కొత్తవారు వచ్చినా, ఎన్ని హిట్లు ఇచ్చినా, ఆ కాంబోలో ఉండే మ్యాజికే వేరు. త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్, బోయపాటి- బాలకృష్ణ, ప్రభాస్- రాజమౌళి, సుకుమార్- అల్లు అర్జున్. ప్రస్తుతం ఇప్పుడు అందరి చూపు సుకుమార్- అల్లు అర్జున్ కాంబో మీదనే ఉంది. ఆర్య, ఆర్య 2, పుష్ప, ఇప్పుడు పుష్ప 2. ఇక నిన్న వచ్చిన పుష్ప 2 వీడియోతో యూట్యూబ్ షేక్ అయిన విషయం తెల్సిందే. ఈ కాంబోపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆర్య సినిమాతో బన్నీని స్టార్ గా నిలబెట్టిన డైరెక్టర్ సుక్కు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా నిలబెట్టాడు. వీరిద్దరి కాంబో అంటే బాక్సాఫీసే భయపడుతుంది అంటే అతిశయోక్తి కాదు. రా అండ రస్టిక్ లుక్ లో బన్నీని చూస్తామని ఎవరు అనుకోలేదు. కానీ, స్టైలిష్ స్టార్ ను ఇలా రా అండ్ రస్టిక్ లుక్ లో చూపించిన ఘనత అంటే అది సుకుమార్ కే చెందుతుంది.

Samantha: మాజీ భర్తను మర్చిపోయినా.. మరిదిని గుర్తుపెట్టుకొని మరీ విష్ చేసిందే

బన్నీని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. సుకుమార్ కు బాగా తెలుసు. అందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ను తీర్చిదిదుతున్నాడు సుక్కు. ఇక నేడు బన్నీ బర్త్ డే కావడంతో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోను మేకర్స్ షేర్ చేసి అభిమానుల్లో మరింత జోష్ పెంచారు. పుష్ప రాజ్ గెటప్ లో ఉన్న బన్నీతో సుకుమార్ ఏదో సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నట్లు కనిపిస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు బ్రో అని ఒకరు అంటే.. ఈసారి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాలని సుకుమార్ బన్నీకి చెప్తున్నాడు అనుకుంటా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ కాంబో ఈసారి ఎలాంటి రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.

Show comments