NTV Telugu Site icon

Allu Arjun: అర్హాకి బన్నీ స్పెషల్ బర్త్ డే విషెష్…

Allu Arha

Allu Arha

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారినా… ఐకాన్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగినా కూడా అల్లు అర్జున్ తన పిల్లలకి మాత్రం ఒక మంచి ఫాదర్ గానే ఉంటాడు. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు అల్లు అర్జున్. అందుకే సోషల్ మీడియాలో చాలా ఫ్రీక్వెంట్ గా అల్లు అర్జున్, స్నేహ, అల్లు అర్హ, అయాన్ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. మెగా ఫ్యామిలీలో అకేషన్స్ ఉన్నా కూడా ఫ్యామిలీతో సహా అటెండ్ అయ్యి ఆ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. ముఖ్యంగా అర్హ ఫోటోలని ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాడు బన్నీ, అందుకే సోషల్ మీడియాలో అర్హాకి మంచి ఫాలోయింగ్ ఉంది.

Read Also: Manchu Vishnu: 48 గంటల్లో ‘కన్నప్ప’ వస్తున్నాడు…

ఈ ఏడేళ్ల పాపకి మెగా ఫ్యాన్స్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పుడే సినిమాల్లో కూడా నటిస్తున్న అర్హ ఫోటోలు సోషల్ మీడియాలో తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. ఈరోజు అర్హ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అర్హ ఫోటోస్ ని పోస్ట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా అల్లు అర్హ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “హ్యాపీ బర్త్ డే టు మై జాయ్” అంటూ కోట్ చేసాడు. ఈ ఫోటోలు లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ మ్యారేజ్ సమయంలో తీసినట్లు ఉన్నాయి. మరి నియర్ ఫ్యూచర్ లో అల్లు అర్జున్-అల్లు అర్హ కలిసి నటిస్తారేమో చూడాలి.

Read Also: Anasuya Bharadwaj: మత్తు కళ్ళు అందాలతో మతి పోగొడుతున్న అనసూయ…

Show comments