“పుష్ప : ది రైజ్” మూవీ చిత్రబృందానికే కాదు టాలీవుడ్ కు కూడా చిరస్మరణీయంగా మిగిలింది. ఈ సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్న ఎంతోమంది హృదయాల్లోప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే తాజాగా ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ ను గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్.
Read Also : “సర్కారు వారి పాట” అప్డేట్… మళ్ళీ రంగంలోకి మహేష్
“ఇది తీరిక సమయంలో రాయాలనుకున్నాను. మా సోదరుడు సిద్ శ్రీరామ్ గారు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో స్టేజ్‌పై “శ్రీవల్లి” పాడారు. ఆయన సంగీతం లేకుండానే స్టేజ్ పై ఈ పాట పాడారు. సంగీత వాయిద్యం నెమ్మదిగా ఆయన గాత్రానికి సపోర్ట్ ఇస్తుందేమో అని నేను ఎదురు చూశాను. కానీ అలాంటిదేం జరగలేదు. ఆయన సంగీతం లేకుండానే పాడుతున్నడు. ఆయన పాట చాలా అద్భుతంగా మ్యాజికల్ గా వినిపిస్తోంది…అతనికి సంగీతం అవసరం లేదు.. అతనే సంగీతం…” అంటూ సిద్ శ్రీరామ్ పై సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి సిద్ శ్రీరామ్ కూడా స్పందిస్తూ అల్లు అర్జున్ కు రిప్లై ఇచ్చారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్‌లతో పాటు తెలుగులో 2021 డిసెంబర్ 17న థియేటర్‌లలో విడుదలై సంచలనం సృష్టించింది. ముఖ్యంగా హిందీలో…
ఇదిలా ఉంటే మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండవ భాగాన్ని ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
