Allu Arjun: మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెల్సిందే. నవంబర్ 1 న వీరి పెళ్లి జరగనుంది. ఇక మెగా, అల్లు కుటుంబాలు ఈ పెళ్లి వేడుకలో సంతోషంగా పాల్గొంటున్నారు. ఇక గత కొన్ని రోజులుగా మెగా- అల్లు వారి కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయని, రామ్ చరణ్ – అల్లు అర్జున్ మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక వరుణ్ పెళ్లి వీరిని ఒకటిగా చేసింది. తమ మధ్య అభిప్రాయ బేధాలు ఏమి లేవని.. బన్నీ, చరణ్ కలిసి ఉన్న ఫొటోలే నిదర్శనంగా చూపిస్తున్నారు అభిమానులు. ఇక బన్నీ తన కుటుంబంతో సహా ఇటలీలో వాలినప్పటినుంచి బన్నీ భార్య స్నేహ రెడ్డి రోజుకో ఫోటో పెడుతూ.. అభిమానులను అలరిస్తుంది.
Sri Divya: అమ్మడు ప్రేమించింది హీరోనేనా.. ?
తాజాగా బన్నీ కూడా ఒక ఫోటో షేర్ చేశాడు. తన కొడుకు అయాన్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ” మై లిటిల్ బ్యాడ్ బాయ్” అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఈ ఫొటోలో తండ్రీకొడుకులు బ్లాక్ సూట్ లో మెరిపించారు. అయాన్ అల్లరి చేస్తూ ఉంటే పట్టుకొని బన్నీ నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. బన్నీ కొడుకు అయాన్ కన్నా.. కూతురు అర్హ తోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాడు. ఇక చాలా రేర్ గా అయాన్ తో కనిపిస్తాడు. ఇది రాత్రి జరిగిన కాక్ టైల్ పార్టీలోని క్లిక్ లా అనిపిస్తుంది. మరి పెళ్ళిలో ఈ అల్లరి పిడుగుల అల్లరి ఎలా ఉంటుందో చూడాలి అంటే.. స్నేహ వీడియోలు పెట్టేవరకు ఆగాల్సిందే.
