Allu Arjun Says Allu Ayaan model bolthey Comments: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ గారాలపట్టి అల్లు అర్హ సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి సెలబ్రిటీ హోదాను అర్హ అనుభవిస్తుంది. బన్నీతో అర్హ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ కనిపించే వీడియోలు నెట్టింట ఎంతలా వైరల్ గా మారాయి అనేది అందరికీ తెలిసిందే. ఇక బన్నీ కొడుకు అయాన్ మాత్రం అంత స్టార్ డమ్ ను తెచ్చుకోలేకపోయినా అయాన్ సోషల్ మీడియాలో ట్రోల్ కంటెంట్ గా మారాడు. రోనా సమయంలో అందరు బయట చప్పట్లు కొడుతుంటే.. ఆ సౌండ్ కి అయాన్ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Bigg Boss Pallavi Prasanth :పల్లవి ప్రశాంత్ లో ఈ మార్పును అస్సలు ఊహించి ఉండరు.. గ్రేట్ కదా..
ఇక ఆ తర్వాత.. బన్నీకి నేషనల్ అవార్డు ప్రకటించిన రోజున మీడియా మొత్తం శుభాకాంక్షలు చెప్పడానికి బన్నీ ఇంటికి వెళ్లారు. అక్కడ బన్నీకి విషెస్ చెప్తుంటే పై పోర్షన్ లో అయాన్ గోడకు బల్లిలా అతుక్కొని కనిపించి నవ్వించాడు. ఇక ఆ తర్వాత దసరా రోజున స్నేహ.. అర్హ, అయాన్ కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలపగా ఫ్లోరల్ కుర్తీ వేసుకొని మోడల్ లా ఫోజిచ్చాడు. ఇక ఇప్పుడు అల్లు అయాన్ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఇటీవల అల్లు అర్జున్ బెర్లిన్ వెళ్లగా అక్కడ ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఫ్యాన్.. అల్లు అయాన్ అంటూ గట్టిగా అరిచారు. వెంటనే బన్నీ స్పందిస్తూ మోడల్ బోల్తే అంటూ మోడల్ సింబల్ చూపించారు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అంతా గట్టిగా అరుస్తూ సందడి చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అల్లు అయాన్.. మోడల్ బోల్తే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
