NTV Telugu Site icon

Animal Movie: యానిమల్ మూవీకి అల్లు అర్జున్ రివ్యూ

Allu Arjun Review

Allu Arjun Review

Allu Arjun Review to Animal Movie: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన నేపథ్యంలో ఈ సినిమాకి ఒక్కరొక్కరుగా రివ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు రివ్యూలు ఇవ్వగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా రివ్యూ ఇచ్చారు. యానిమల్ సినిమా జస్ట్ మైండ్ బ్లోయింగ్, ఆ సినిమాటిక్ బ్రిలియన్స్ పిచ్చెక్కించింది. రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్స్ పీరియన్స్ ను వేరే లెవల్ కు తీసుకువెళ్లాడు. చాలా ఇన్స్ ఫైరింగ్ అనిపించింది, మీ మ్యాజిక్ తో నా నోట మాటలు రావడం లేదు. రష్మిక, బ్రిలియంట్ గా నటించావ్ ఇప్పటి దాకా నీ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇది, ఇంకా ఇలాంటివి మరెన్నో చేయబోతున్నావని అర్ధం అవుతోంది.

Bhagavanth Kesari: థియేటర్స్ లో మిస్ అయిన సాంగ్ యూట్యూబ్ లోకి వచ్చేసింది…

బాబీ డియోల్ మీ పెర్ఫార్మెన్ మమ్మల్ని సైలెంట్ చేసింది, మీ టెరిఫిక్ నటనకు నా రెస్పెక్ట్. యంగ్ హీరోయిన్ తృప్తి గుండెలను బ్రేక్ చేస్తోంది, ఇంకా చేస్తుందని భావిస్తున్నాను. మిగతా అందరు నటీనటులు, టెక్నీషియన్లు కూడా సినిమాను మరో లెవల్ కి తీసుకు వెళ్లారు, వాళ్లందరికీ కంగ్రాట్స్. సందీప్ రెడ్డి వంగా జస్ట్ మైండ్ బ్లోయింగ్. మీరు అన్ని సినిమా పరిమితులను అధిగమించారు, ఈ సినిమా తీవ్రత సాటిలేనిది. మీరు మరోసారి మా అందరినీ గర్వపడేలా చేశారు. మీ సినిమాలు ఇప్పుడు మరియు భవిష్యత్తులో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతున్నాయో నేను స్పష్టంగా చూడగలనని అల్లు అర్జున్ రాసుకొచ్చాడు. టీ సిరీస్ భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి సోదరుడు ప్రణయ్ రెడ్డి భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ల మీద నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల వారి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.