Site icon NTV Telugu

Allu Arjun : గౌరవంగా భావిస్తున్నా.. గద్దర్ అవార్డుపై అల్లు అర్జున్..

Allu Arjun

Allu Arjun

Allu Arjun : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు(పుష్ప-2) అవార్డు దక్కింది. దీనిపై తాజాగా అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనకు ఈ అవార్డును ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. పుష్ప-2 సినిమాకు గాను తొలిసారి బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ గౌరవాన్ని నాకు కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన ఘనత అంతా మా డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్లు, మా మూవీ టీమ్ కే దక్కుతుంది.

Read Also : HariHara VeeraMallu: ఓజీ షూట్ అయ్యాక అర్ధరాత్రి వీరమల్లు డబ్బింగ్.. దటీజ్ పవన్ కళ్యాణ్

ఈ అవార్డు నా ఫ్యాన్స్ కు అంకితం చేస్తున్నాను. అభిమానులు చూపించే అవాజ్యమైన ప్రేమ, మద్దతు నాలో స్ఫూర్తిని నింపుతూనే ఉంటాయి’ అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో పుష్ప మొదటి పార్టుకు జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

Read Also : Air Chief AP Singh: తేజస్ ఫైటర్ జెట్స్ ఆలస్యంపై వైమానిక దళాధిపతి సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version