Site icon NTV Telugu

Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన రెండు భారీ మూవీలు..

Allu Arjun

Allu Arjun

Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన బన్నీ.. కొన్ని భారీ సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. అందులోనూ ఓ రెండు సినిమాలు చేసి ఉంటే మాత్రం ఆయన రేంజ్ వేరే లెవల్ లో ఉండేదేమో. 2020లో కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబోలో ఓ మూవీని ప్రకటించారు. ఇద్దరూ సముద్రపు ఒడ్డున నిలబడి ఉన్న ఫొటోను కూడా రిలీజ్ చేశారు. కానీ బన్నీకి ఆ కథ నచ్చక రిజెక్ట్ చేశాడు. పైగా చిరంజీవి, రామ్ చరణ్‌ తో చేసిన ఆచార్య ప్లాప్ అయింది.

Read Also : Uppena : ఉప్పెన మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో

ఆ దెబ్బతో కొరటాలను పక్కన పెట్టేశాడు బన్నీ. అదే కథతో కొరటాల శివ ఎన్టీఆర్ తో దేవర మూవీని తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అది పాన్ ఇండియా స్థాయిలో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. అర్జున్ రెడ్డి మూవీతో సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఓ మూవీని ప్రకటించాడు. కానీ అనుకోని కారణాలతో దాన్ని పక్కన పెట్టేశాడు బన్నీ.

అదే కథతో రణ్ బీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీని తీశాడు సందీప్. అది ఎంత పెద్ద హిట్ అయిందో చూశాం. ఒకవేళ ఈ రెండు సినిమాలు అల్లు అర్జున్ చేసి ఉంటే పుష్పతో ఎలాంటి ఇమేజ్ వచ్చిందో.. ఈ సినిమాలతో కూడా అదే స్థాయిలో ఇమేజ్ వచ్చి ఉండేదేమో. కానీ అనవసరంగా మిస్ చేసుకున్నాడు బన్నీ.

Read Also : Sekhar Kammula : అందుకే ధనుష్ అంటే టెన్షన్.. శేఖర్ కమ్ముల కామెంట్స్

Exit mobile version