Allu Arjun Rejected Cameo in Jawan: కింగ్ ఖాన్ గా బాలీవుడ్ ప్రేక్షకులు అందరూ భావించే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ గురువారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతూ కలెక్షన్స్ రచ్చ రేపుతున్నాయి. అయితే సినిమా రెండు రోజుల్లోనే వందల కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో అల్లు అర్జున్ ఫాన్స్ లో కొత్త అనుమానం మొదలయింది. అదేమంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఒక పాత్ర చేయమని అడిగితే చేయను అన్నాడు అని టాక్ వచ్చింది కదా, అసలు ఏ పాత్రకు అడిగి ఉంటారనే చర్చ జరుగుతోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ ను జవాన్ లో చివరిలో వచ్చే సంజయ్ దత్ పాత్ర కోసం దర్శకుడు అట్లీ సంప్రదించినట్టు తెలుస్తోంది.
ముందు విజయ్ ను అడిగితే ఆయన కాదన్నారు, ఆ తర్వాత అల్లు అర్జున్ ని సంప్రదించాడని తెలుస్తోంది. అటు విజయ్, ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ ఒప్పుకోకపోవడంతో సంజయ్ దత్ ను సంప్రదించి ఆయనతో చేయించారని అంటున్నారు. అయితే అటు విజయ్ కానీ అల్లు అర్జున్ కానీ ఒకవేళ ఈ పాత్ర చేసినా అది ఈ సినిమాకు ప్లస్ అయ్యేదేమో కానీ వారిద్దరి కెరీర్ కు ఏమీ కలిసొచ్చేలా లేదు. లుంగీ కట్టుకుని స్కూటర్ మీద జైలుకు వచ్చి షారుఖ్ ని పట్టుకునేందుకు వచ్చే ఆఫీసర్ పాత్రలో అల్లు అర్జున్, విజయ్ అదరకొట్టి ఉండేవారు. వారి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండేది కానీ ఆ కాసేపు నిలబడి డైలాగ్స్ చెప్పడం తప్ప అంతకు మించిన విషయం ఏమీ ఉండేది కాదు.
కాబట్టి వారిద్దరూ ఈ సినిమా చేయకపోవటమే మంచిదయిందని అటు విజయ్, ఇటు అల్లు అర్జున్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ‘జవాన్’ సినిమాలో షారుఖ్ సరసన నయనతార హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె క్యామియో రోల్ లో మెరిసింది. ఈ సినిమాతో దర్శకుడు అట్లీ బాలీవుడ్ అరంగేట్రం చేయగా విజయ్ సేతుపతి విలన్ గా షారుఖ్ టీమ్ మేట్ గా ప్రియమణి కీ రోల్స్ పోషించింది. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ఆయన భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించింది. ‘జవాన్’ను హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు.