Site icon NTV Telugu

Allu Arjun: పుష్పరాజ్ కోసం రంగంలోకి దిగనున్న ‘ఖిలాడీ’?

Pushpa 2

Pushpa 2

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’… పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి పార్ట్ కంటే భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, గ్రాండ్ స్కేల్ లో పుష్ప ది రూల్ సినిమాని షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ప్రీవ్యూ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప2 పై పెరిగిన అంచనాలను అందుకోవడానికి భారీగా ప్లాన్స్ వేస్తున్నాడు సుకుమార్. 350 కోట్ల భారీ బడ్జట్ తో ఖర్చుకి వెనుకాడకుండా భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఇన్వాల్వ్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఊర్వశీ రౌటేలాతో ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన సుకుమార్, లేటెస్ట్ గా ఒక బాలీవుడ్‌ స్టార్ హీరోని కూడా క్యామియో కోసం సంప్రదించాడట. పుష్ప2లో ఓ అతిథి పాత్ర ఉందని, ఆ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా… సినిమాపై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుందట.

అందుకే… సుకుమార్ ఓ బాలీవుడ్ స్టార్ హీరోని పట్టుకునే పనిలో ఉన్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇన్నాళ్లు అతనెవరేనది సస్పెన్స్‌గా మారింది కానీ ఇప్పుడు బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ బడా స్టార్ ఎవరో తెలిసిపోయింది అంటూ బాలీవుడ్ మీడియా చెప్తోంది. బాలీవుడ్ వర్గాల ప్రకారం సీనియర్ స్టార్ హీరో, ఖిలాడీ అక్షయ్ కుమార్ పుష్ప 2లో అతిథి పాత్రలో నటిస్తున్నట్టుగా… ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో పుష్ప సినిమా చూసి సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు అక్షయ్ కుమార్. ఒకవేళ నిజంగానే సుకుమార్, అక్షయ్ కుమార్‌ను అప్రోచ్ అయితే గెస్ట్ రోల్ చేయడం గ్యారెంటీ. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తంగా రోజు రోజుకి పుష్ప 2 పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.

Exit mobile version