Allu Arjun: పుష్పరాజ్ కోసం రంగంలోకి దిగనున్న ‘ఖిలాడీ’?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’… పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి పార్ట్ కంటే భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, గ్రాండ్ స్కేల్ లో పుష్ప ది రూల్ సినిమాని షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ప్రీవ్యూ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప2 పై పెరిగిన అంచనాలను అందుకోవడానికి భారీగా ప్లాన్స్ వేస్తున్నాడు సుకుమార్. 350 కోట్ల భారీ బడ్జట్ తో ఖర్చుకి వెనుకాడకుండా భారీ స్టార్ క్యాస్టింగ్‌ను ఇన్వాల్వ్ చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఊర్వశీ రౌటేలాతో ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన సుకుమార్, లేటెస్ట్ గా ఒక బాలీవుడ్ స్టార్ హీరోని కూడా క్యామియో కోసం సంప్రదించాడట. పుష్ప2లో ఓ అతిథి పాత్ర ఉందని, ఆ పాత్ర నిడివి చాలా తక్కువే అయినా… సినిమాపై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుందట.
అందుకే… సుకుమార్ ఓ బాలీవుడ్ స్టార్ హీరోని పట్టుకునే పనిలో ఉన్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇన్నాళ్లు అతనెవరేనది సస్పెన్స్‌గా మారింది కానీ ఇప్పుడు బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ బడా స్టార్ ఎవరో తెలిసిపోయింది అంటూ బాలీవుడ్ మీడియా చెప్తోంది. బాలీవుడ్ వర్గాల ప్రకారం సీనియర్ స్టార్ హీరో, ఖిలాడీ అక్షయ్ కుమార్ పుష్ప 2లో అతిథి పాత్రలో నటిస్తున్నట్టుగా… ఓ న్యూస్ వైరల్ అవుతోంది. గతంలో పుష్ప సినిమా చూసి సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు అక్షయ్ కుమార్. ఒకవేళ నిజంగానే సుకుమార్, అక్షయ్ కుమార్‌ను అప్రోచ్ అయితే గెస్ట్ రోల్ చేయడం గ్యారెంటీ. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తంగా రోజు రోజుకి పుష్ప 2 పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.
Also Read
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్‌పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
- Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
- Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక... త్వరలోనే గుడ్ న్యూస్
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: వికసిత్ భారత్-2047 లక్ష్యంతో టెక్నాలజీ విప్లవం.. హైదరాబాద్‌కు 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.!
-
VIDA VX2 Plus: 187KM రేంజ్‌తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్‌పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్‌లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్‌లో ఆ ప్లేయర్‌తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!