ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’, ‘నీ అవ్వ తగ్గదే లే’, ‘పార్టీ లేదా పుష్ప’ లాంటి డైలాగ్స్ ఇండియా వైడ్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని వార్నర్ నుంచి బాలీవుడ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమాని సుకుమార్ అండ్ టీం రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 8న పుష్ప ది రైజ్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందనే అనౌన్స్మెంట్ ఇప్పటికే బయటకి వచ్చేసింది. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో మేకర్స్ ‘పుష్ప’ ట్రైలర్ ని రష్యన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. రష్యా కోసం సపరేట్ గా ట్రైలర్ కట్ చేయకుండా తెలుగు ట్రైలర్ కే రష్యన్ భాషలో డైలాగ్స్ చెప్పించారు. క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు కానీ ఒరిజినల్ చూసిన వాళ్లం కాబట్టి మనకి ఆ డైలాగ్ అర్ధమవుతుంది.
పుష్ప ది రైజ్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా వెళ్లనున్నారు. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్ లో మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. పుష్ప పార్ట్ 1కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తే, అది పార్ట్ 2కి ఉపయోగ పడుతుందనే మాస్టర్ ప్లాన్ ఎవరిదో కానీ మేకర్స్ మాత్రం ఇన్ డైరెక్ట్ గా ‘పుష్ప 2’ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం అనే హింట్ ఇచ్చేశారు. మరి ఏడాది కాలంగా పాన్ ఇండియా ఆడియన్స్ ని వెయిట్ చేయిస్తున్న ‘పుష్ప 2’ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందో చూడాలి.