Site icon NTV Telugu

దసరా పండక్కి ‘పుష్ప’ రాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ జులై నుంచి జెట్ స్పీడ్ లో జరగనుందట. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని దసరా పండక్కి విడుదల చేయాలని భావిస్తున్నాడట. షూటింగ్ పునప్రారంభించిన వెంటనే విడుదల తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చుతుండగా… మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది.

Exit mobile version