యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్టోబర్ 14న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” అంటూ థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అక్టోబర్ 19న సాయంత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ అఖిల్ పై ప్రశంసలు కురిపించాడు. “అఖిల్ ను చూస్తే తమ్ముడు అన్న ఫీలింగ్ వస్తుంది. తనకు ఈరోజు ఇంత పెద్ద హిట్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్ చాలా బాగా డ్యాన్సులు, ఫైట్లు చేస్తాడు. కానీ అవన్నీ చేయగలిగి కూడా తాను కేవలం ఫిజికల్ అప్పియరెన్స్ తోనో, లుక్స్ తోనో కాదు… ఒక కథను ఎన్నుకుని, మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాడు. దానిని నేను గౌరవిస్తున్నాను.
Read Also : బార్సిలోనా పార్క్ లో మహేష్ ఫ్యామిలీ… పిక్ వైరల్
ఎక్కడున్నా అక్కినేని నాగేశ్వర రావు, అల్లు రామలింగయ్య గారు చూస్తూ ఉంటారు. మా రెండు కుటుంబాల ప్రయాణం దాదాపు 70 దశాబ్దాల నాటిది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయితే ఇద్దరు మనవళ్లతో కలిసి ఆయన సినిమాలు చేయడం నిజంగా అదృష్టం. ఇటీవలే నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ చిత్రబృందానికి శుభాకాంక్షలు. ఇద్దరు బ్రదర్స్ వరుసగా హిట్లు కొట్టడం విశేషం. ఇద్దరు కొడుకులు ఇలా వరుసగా హిట్లు కొట్టడంతో నాగార్జున ఎంత సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు” అంటూ సినిమా విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.
