“పుష్ప : ది రైజ్” విజయం తర్వాత అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరిగా మారారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఇంకేముంది ‘పుష్ప-2’… కానీ ఆ తరువాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. దర్శకుడు అట్లీతో ఒక చిత్రం కోసం అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప’ కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న అల్లు అర్జున్ కు లైకా ప్రొడక్షన్స్ 100 కోట్లు ఆఫర్ చేసింది. మీడియా నివేదికల ప్రకారం అల్లు అర్జున్, అట్లీ ఇప్పటికే అధికారికంగా సమావేశమయ్యారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి చర్చించారు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
Read Also : హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో
‘పుష్ప’తో అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగింది. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ కోసం పని ప్రారంభించనున్నాడు. ‘పుష్ప’ సెకండ్ పార్ట్ మార్చిలో సెట్స్ పైకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే నయనతార, షారూఖ్ ఖాన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో అట్లీ ఓ సినిమా చేస్తున్నాడు. టీమ్ ఇప్పటికే పూణేలో మొదటి షెడ్యూల్‌ను ముగించింది. త్వరలో నెక్స్ట్ షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభించాలని ఎదురు చూస్తోంది.
