ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రాకా’ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ లైన్అప్ ఎలా ఉండబోతోందనే విషయంపై ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ రాబోయే నాలుగైదేళ్ల పాటు తెలుగు దర్శకులను పక్కన పెట్టేసి పూర్తిగా పరభాషా దర్శకులకే ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే సందేహాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
వాస్తవంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు హ్యాట్రిక్ హిట్స్‌గా నిలిచాయి. కానీ త్రివిక్రమ్ సినిమా స్థానంలో కోలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా‘ సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బన్నీ మరో సినిమా చేయనున్నట్లు టాక్. ‘లియో’, ‘కూలీ’ చిత్రాలతో ఆశించిన స్థాయిలో మెప్పించలేక లోకేష్ కాస్త ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ, ఆయన చెప్పిన పవర్‌ఫుల్ లైన్‌తో బన్నీ ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దీంతో పాటు ఈ లైనప్‌లోకి సరికొత్తగా మలయాళ సెన్సేషనల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ పేరు కూడా వచ్చి చేరింది. బన్నీ-బాసిల్ కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్లేనని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇటీవల బాసిల్ జోసెఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఐకాన్’ అని రాసి ఉన్న క్యాప్‌ను పోస్ట్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్ సాంగ్ ‘రింగ రింగ..’ను జత చేయడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ లెక్కన చూసుకుంటే, రాబోయే నాలుగైదేళ్ల పాటు అల్లు అర్జున్ డైరీ మొత్తం అట్లీ, లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్ వంటి పరభాషా దర్శకులతోనే నిండిపోయేలా ఉంది. మరి ఈ లైనప్‌తో ఐకాన్ స్టార్ పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

