Site icon NTV Telugu

Allu Arjun: నా సినిమాకు మా నాన్న డబ్బులు ఇవ్వలేదు..

Arjun

Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డు విన్నర్ గా ఈ ఏడాది బన్నీ ఒక చరిత్ర సృష్టించాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రతి ఇంటర్వ్యూలో బన్నీ తన మొదటి సినిమా విషయాలను చెప్పుకొస్తాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు బన్నీ. కానీ, ఈ సినిమా కన్నా ముందే బన్నీ కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా బన్నీ నటించిన మొదటి సినిమా విజేత. చిరంజీవి నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించాడు. అల్లు రామలింగయ్య సమర్పించిన ఈ సినిమాకు కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించాడు.

విజేత సినిమాలో వెంకటేష్ అనే క్యారెక్టర్ లో నటించాడు అల్లు అర్జున్. ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా అల్లు అరవింద్ విజేత 100 డేస్ షీల్డ్ ను పట్టుకుకొని నవ్వుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. ” నా మొదటి సినిమా విజేత.. దానికి నిర్మాత మా డాడ్” అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఓ మై గాడ్.. నాకు ఈ సినిమాకు మా నాన్న డబ్బులు ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అప్పుడు ఇవ్వకపోతే ఏం ఇప్పుడు అడిగి తీసుకో అన్నా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే వచ్చే ఏడాది బన్నీ పుష్ప 2 రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో బన్నీ ఎలాంటి రికార్డులు బద్దలుకొడతాడో చూడాలి.

Exit mobile version