Site icon NTV Telugu

Icon Star: త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్!

Allu Arjun

Allu Arjun

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో’ చిత్రాలు వచ్చాయి. అందులో ‘జులాయి’ సూపర్ హిట్ కాగా, ‘అల వైకుంఠపురములో….’ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ నటుడిగా అల్లు అర్జున్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్… త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.

దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఇది సినిమా షూటింగ్ కాదు, ఓ బ్రాండ్ కు సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్ షూటింగ్! తెలుగులో ప్రిన్స్ మహేశ్ బాబు తర్వాత ఆ స్థాయిలో పలు డిఫరెంట్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా ఉన్నాడు అల్లు అర్జున్. ‘పుష్ప’ సినిమా తర్వాత మరిన్ని బ్రాండ్స్ కు ఐకాన్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండటం విశేషం.

Exit mobile version