Pushpa 2: చీరలో బన్నీ ఫోటో లీక్… సుకుమార్ సీరియస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలు సుకుమార్, అల్లు అర్జున్‌ని అమ్మవారి గెటప్ లో… చీరలో చూపిస్తాడని ఎవ్వరు ఊహించలేదు. బన్నీ చీరలో కనిపిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో ఉన్న ఒకే ఒక్క ఫోటో ఇండియా వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశంలో పుష్పరాజ్ అమ్మవారి గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా బన్నీ చీరలో ఉన్న ఫోటో ఒక్కటి మాత్రమే రిలీజ్ చేశారు కానీ తాజాగా చీరలో ఉన్న అల్లు అర్జున్ లీక్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది పుష్ప2. అక్కడే గంగమ్మ జాతర సెటప్ వేసి చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే అమ్మవారి గెటప్‌కు సంబంధించిన షూటింగ్ అయిపోయింది. లేటెస్ట్ షెడ్యూల్‌లో హీరోయిన్ రష్మిక మందన్నతో పాటు ఫాహద్ ఫాసిల్ మరియు ఇతర నటీ నటులపై షూట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో పుష్ప ఆన్ సెట్ ఫోటో ఒకటి లీక్ అయింది. అల్లు అర్జున్ చీర కట్టుకొని కుర్చీలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో ఎలా లీక్ అయిందో తెలియదు గానీ సుకుమార్ మాత్రం ఈ విషయంలో సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలోను పుష్ప 2 సెట్స్ నుంచి చాలా లీకులు అయ్యాయి. దాంతో, ఇలాంటి లీకుల జరగకుండా పుష్ప మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కూడా మళ్లీ ఇప్పుడు సెట్ నుంచి పవర్ ఫుల్ లీక్ బయటకి వచ్చింది. అల్లు అర్జున్ చీర కట్టుకోని చైర్ లో కూర్చోని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. దీంతో పుష్ప చిత్ర యూనిట్ అసంతృప్తిగా ఉందట. ఏదేమైనా… పుష్ప2 లేటెస్ట్ లీక్డ్ పిక్ మాత్రం పీక్స్‌లో ఉందనే చెప్పాలి. అమ్మవారి గెటప్‌లో పుష్పరాజ్ చేసే మాస్ జాతర చూడాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!