NTV Telugu Site icon

Allu Arjun : పోలీస్ స్టేషన్ కు బయలుదేరిన అల్లు అర్జున్

Alluarjun

Alluarjun

పుష్ప -2 ప్రీమియర్ రోజు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఘటనలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇటీవల నాంపల్లి హైకోర్టు అల్లు అర్జునుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు. కానీ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని షరతు విధించారు. కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దన్న న్యాయస్థానం సూచించింది.

Also Read : UnstoppablewithNBKS4 : బాలయ్య, రామ్ చరణ్ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్

కాగా నేడు ఆదివారం కావడంతో చిక్కడపల్లి పీఎస్‌ లో విచారణకు హాజరుకానున్నాడు అల్లు అర్జున్. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం పీఎస్‌కు విచారణ నిమిత్తం వెళ్ళాడు అల్లు అర్జున్. కాగా విచారణ అనంతరం సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ని పరామర్శించడానికి కిమ్స్ కి కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు రాంగోపాల్‌పేట్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శిస్తానని అల్లు అర్జున్‌ పోలీసులకు తెలుపడంతో అల్లు అర్జున్‌ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లొదంటూ పోలీసుల నోటీసులు జారీ చేసారు. ఒకవేళ వస్తే అక్కడ జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో అల్లు అర్జున్‌ మేనేజర్‌కు నోటీసులు అందజేశారు చిక్కడపల్లి పోలీసులు. మరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్  కు బయలుదేరిన అల్లు అర్జున్ విచారణ అనంతరం కిమ్స్ ఆసుపత్రికి వెళతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Show comments