NTV Telugu Site icon

Allu Arjun: ఇదేం వాడకం రా అయ్యా.. ఆ వీడియోని కూడా వదలడం లేదుగా?

Allu Arjun Fake Video

Allu Arjun Fake Video

Allu Arjun Fake Video Promoting Congress goes Viral: లోక్‌సభ ఎన్నికల హడావుడి ఇలా మొదలయిందో లేదో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు తెర మీదకు వస్తున్నాయి.. వాళ్ళు ఏ పార్టీకి ప్రచారం చేయకున్నా చేస్తున్నట్టుగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొణె, అలియా భట్, కాజోల్, రష్మిక మందన్నల వీడియోలు వైరల్ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ 22 సోమవారం నాడు నటుడు అల్లు అర్జున్ ఉన్న క్లిప్ కూడా వైరల్ అయ్యింది. ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండడంతో అది నిజమే అనుకునే అవకాశం కూడా ఉంది.

Suriya 44: సూర్య సినిమా నటించాలని ఉందా?.. ఇలా చేయండి!

అయితే అసలు విషయం ఏమిటా అని పరిశీలిస్తే వైరల్ అవుతున్న వీడియోలో, అల్లు అర్జున్ ఓపెన్-టాప్ కారులో నిలబడి, ప్రజలను చూస్తూ నవ్వుతూ కనిపించాడు. పక్కనే ఆయన భార్య స్నేహారెడ్డి కూడా కనిపిస్తున్నారు. ‘కాంగ్రెస్‌ కోసం అల్లు అర్జున్‌ ప్రచారంలో ఉన్నారు’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. అల్లు అర్జున్ భారతదేశపు అతిపెద్ద సూపర్ స్టార్. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే అసలు విషయం అది కాదు. ఈ వీడియో వాస్తవానికి 2022 నాటిది, అల్లు అర్జున్ న్యూయార్క్‌లో ఉన్నప్పుడు, అక్కడ యుఎస్‌లోని ఎన్నారైలు నిర్వహించిన అత్యంత ప్రసిద్ధ వార్షిక ఈవెంట్‌లలో ఒకటైన ‘ఇండియా డే పరేడ్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అల్లును ‘గ్రాండ్ మార్షల్’ బిరుదుతో అక్కడి వారు సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకున్నారు. పరేడ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన వీడియోను పోస్ట్ చేస్తూ, అల్లు ఇన్‌స్టాగ్రామ్‌లో, ‘న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్ కావడం గౌరవంగా ఉంది’ అని షేర్ చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా, అమీర్ ఖాన్, రష్మిక మందన్న – కత్రినా కైఫ్ యొక్క డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించాయి. తాజాగా రణ్‌వీర్ సింగ్ డీప్‌ఫేక్ వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’లో కనిపించనున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రం ‘పుష్ప 1: ది రైజ్’ తరువాత కథతో రానుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానుంది.

Show comments