NTV Telugu Site icon

Allu Arjun: దేవిశ్రీ అసహనం.. బన్నీ కీలక వ్యాఖ్యలు!

Allu Arjun Devi

Allu Arjun Devi

తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో నిర్మాతల మీద దేవి శ్రీ ప్రాసాద్ తన అసహనాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. దేవిశ్రీ అంద‌రికీ మ్యూజిక్ ఇస్తాడు. నాకు ప్రేమ కూడా ఇస్తాడు. దేవి లేక‌పోతే నా ప్ర‌యాణం పూర్త‌వ‌దు అని బన్నీ అన్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా చెన్నైకి వచ్చినప్పుడు వచ్చే ఫీల్ వేరు. చెన్నై తో నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, నా తొలి 20 ఏళ్ల జీవితాన్ని చెన్నైలో నేను గడిపాను. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా, ఫైర్ అనుకుంటున్నారా, వైల్డ్ ఫైర్’. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మీ ముందుకు రాబోతున్నాను. నా జీవితంలో అంత వైల్డ్ గా ఇంకా ఎప్పుడు పని చేసి ఉండను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అతిధికి పేరుపేరునా నా ధన్యవాదాలు. నేను ఎంతగానో ఇష్టపడి చెన్నైలో ఈ ఫంక్షన్ పెట్టాలని అనుకున్నాను.

Allu Arjun: క్షమించమని కోరుకుంటున్నా.. ఈ నేలకు ధన్యవాదాలు!

నేను ఇప్పుడు కచ్చితంగా తమిళ్ లోనే మాట్లాడడానికి కారణం ఏంటంటే నేను ఈ మట్టికి ఇచ్చే గౌరవం అది. నేను దుబాయ్ కి వెళ్ళినప్పుడు అరబిక్ లో మాట్లాడాలి, కేరళ వెళ్ళినప్పుడు మలయాళంలో మాట్లాడాలి, హిందీ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడాలి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడాలి అనుకుంటాను. అది నేను ఆ నేలకి ఇచ్చే గౌరవంగా భావిస్తా, మైత్రి మూవీస్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమాను మీరు కాకుండా ఇంకా ఎవరు చేయగలిగే వారు కాదు. ప్రత్యేకంగా రష్మిక గురించి చెప్పాలి. గత నాలుగు సంవత్సరాలుగా నాతో ఈ సినిమా కోసం పని చేస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు రష్మికకు థాంక్స్. అలాగే స్పెషల్ గెస్ట్ సాంగ్ చేసిన శ్రీలీల చాలా కష్టపడే మనిషి. ఈ చిత్రంలో సాంగ్ డాన్స్ చాలా బాగా చేసింది. అది మీరు స్క్రీన్పై చూస్తే అర్థమవుతుంది. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ కు నా ప్రత్యేక ధన్యవాదాలు. తమిళనాడులో ఈ సినిమాను మీరు డిస్ట్రిబ్యూట్ చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది అని అన్నారు.

Show comments