NTV Telugu Site icon

Allu Arjun: క్షమించమని కోరుకుంటున్నా.. ఈ నేలకు ధన్యవాదాలు!

Allu Arjun

Allu Arjun

నిన్న జరిగిన చెన్నై ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలన్న ఆయన ఒకటి సుకుమార్ గురించి అన్నారు. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా నేను చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నా జీవితంలో అంత ఇంపాక్ట్ కలిగించిన ఒకే ఒక్క మనిషి పేరు చెప్పాలి అంటే అది కచ్చితంగా సుకుమార్ మాత్రమే. ఆయన చాలా సిన్సియర్ డైరెక్టర్. సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్, ఎఫెక్ట్స్ అంటూ ప్రతి విషయంలోనూ చాలా క్లియర్ గా సుకుమార్ ఉంటారు. ఇక రెండవది నా ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి.

Samantha: నాగచైతన్య మీద ఇలా ఓపెన్ అయిపోయిందేంటి?

నేను వారిని ఫాన్స్ గా కాదు ఆర్మీ అని పిలుచుకుంటాను. మీరంటే నాకు పిచ్చి. మిమ్మల్నికపై ఇంతగా వెయిట్ చేయించదలచుకోలేదు. ఇకనుండి ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంటాను. నేను కచ్చితంగా మీ అందరి అంచనాలను ఈ డిసెంబర్ 5వ తేదీన రీచ్ అవుతాం అనుకుంటున్నాను. నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పిదాలు ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. చిన్నపాటి తప్పులు ఉన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను భాషను గౌరవించే వ్యక్తిని. నన్ను మీరు క్షమిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏంటో నాకు తెలుసు. అలాగే మీ అంత మంచి యాంకర్ ను నేను ఇంతవరకు చూడలేదు. చాలా బాగా ఈవెంట్ ను హోస్ట్ చేశారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ నేలకు మరోసారి నా ధన్యవాదాలు” అంటూ కామెంట్ చేశారు.

Show comments