Site icon NTV Telugu

Allu Arjun: కో-స్టార్ ను బ్లాక్, అన్ బ్లాక్ చేసిన ఐకాన్ స్టార్!

Varudu

Varudu

Bhanusree Mehra: హీరోయిన్ భానుశ్రీ మెహ్రా గుర్తుందా!? గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘వరుడు’ సినిమాలో హీరోయిన్! ఆ సినిమా తర్వాత అమ్మడికి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. దానికి కారణం లేకపోలేదు. ఆ చిత్ర దర్శకనిర్మాతలు ఓ స్ట్రేటజీ ప్రకారం మూవీలో హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని హైడ్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత భానుశ్రీ మెహ్రా ఐడెంటిటీని రివీల్ చేశారు. కానీ సినిమా అప్పటికే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో భానుశ్రీ మెహ్రాకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్, భానుశ్రీ మెహ్రా… హైదరాబాద్ లో కొన్ని పెళ్ళిళ్ళలకు హాజరై నవ వధూవరులకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. కానీ ఆ పబ్లిసిటీ కూడా మూవీ కలెక్షన్స్ ను పెంచలేకపోయింది.

ఇదిలా ఉంటే… ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో భానుశ్రీ మెహ్రా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని లో-బడ్జెట్ మూవీస్ తో కాలం గడిపేస్తోంది. అయితే… అల్లు అర్జున్ ‘వరుడు’లో నటించినా తనకు ఆ తర్వాత పెద్దంతగా అవకాశాలు రాలేదని, అయినా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతూనే ఉన్నానంటూ భానుశ్రీ మెహ్రా ఈ రోజు ట్వీట్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అల్లు అర్జున్ ఆమెను బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని భానుశ్రీనే మరో పోస్ట్ ద్వారా తెలిపింది. అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశాడంటూ… స్క్రీన్ షాట్ తో సహా మరో పోస్ట్ పెట్టింది. తన ప్రతిష్ఠకు భంగం కలిగే రాతలు రాసిందని బహుశా అల్లు అర్జున్ ఆమెను బ్లాక్ చేసి ఉండొచ్చు. లేదా తెరవెనక ఇంకేమైనా జరిగి కూడా ఉండొచ్చు. ఏదేమైనా కో-స్టార్ ను బన్నీ బ్లాక్ చేయడంతో సోషల్ మీడియాలో నిదానంగా రచ్చ మొదలైంది. ఇది ఎటు దారితీస్తుందని అనుకున్నారో ఏమో… మరి కాసేపటికి బన్నీ తనను అన్ బ్లాక్ చేశాడంటూ అమ్మడే మరో పోస్ట్ పెట్టింది. మొత్తం మీద ఈ వివాదం టీ కప్పులో తుఫాన్ మాదిరిగా కొద్ది సేపటిలోనే చల్లబడిపోయింది.

Exit mobile version