NTV Telugu Site icon

టాప్ విద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సంచలన తారలలో ఒకరు. యూత్ లో ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో, అనేక అగ్ర కంపెనీలు తమ బ్రాండ్‌లకు ప్రచారం చేయడానికి అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప’రాజ్ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఒక టాప్ విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయడానికి సిద్ధమయ్యాడు. 1986 లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభంతో తన చారిత్రాత్మక ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీ చైతన్య విద్యా సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. దీనికి సంబంధించిన యాడ్ ను విద్యా రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న శ్రీచైతన్య వారు నిన్న దసరా సందర్భంగా విడుదల చేశారు.

Read Also : రస్టిక్ లుక్ లో నాని… ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘దసరా’

తాజా యాడ్ కమర్షియల్‌లో అల్లు అర్జున్ “ఐఐటి సక్సెస్ కోసం శ్రీ చైతన్య” అని చెప్పడం, చివరికి ఆయన కాలేజీ విద్యార్థులతో కలిస్ కనిపించడం చూడవచ్చు. “మీ సక్సెస్ కోసం శ్రీ చైతన్య ని ఎంచుకోవడం లో మాత్రమ్ తగ్గేదే లే” అంటూ డైలాగ్ చెప్పారు బన్నీ. శ్రీ చైతన్య విద్యా సంస్థ తమ కళాశాలల ప్రచారం కోసం ఒక ప్రముఖ సినీ నటుడిని ఎంపిక చేసుకోవడం ఇదే మొదటిసారి. అలాగే విద్యా రంగంలో అల్లు అర్జున్ మొదటి కమర్షియల్ యాడ్ కూడా ఇదే.