Site icon NTV Telugu

Pushpa : పుష్ప ది రైజ్ చిత్రానికి మ‌రో అరుదైన గౌర‌వం

Pushpa

Pushpa

Allu Arjun attends ‘Pushpa’ screening at Berlin Film Festival: బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఇండియ‌న్ సినిమా పుష్ప ది రైజ్ ప్ర‌ద‌ర్శ‌న జరిగింది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్లో ఇండియ‌న్ సినిమా త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ద‌క్కిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇక ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న ఇటీవ‌ల బెర్లిన్ 74వ ఇంట‌ర్నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొనేందుకు జ‌ర్మ‌నీకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఐకాన్‌స్టార్ బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో పాల్గొంటున్నారు.

Paruchuri Gopala Krishna: గుంటూరు కారం మహేష్ రేంజ్ సినిమానే కాదు.. షాకిస్తున్న పరుచూరి పలుకులు

కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్.. ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలవడంతోపాటు.. తనకు జాతీయ స్థాయి అవార్డు తెచ్చిపెట్టిన చిత్రంగా పుష్ప నిలిచింది. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప-2 ద రూల్ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఆగ‌స్టు 15న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌గా పుష్ప ది రైజ్ చిత్రాన్ని స్పెష‌ల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహ‌కులు. దీంతో పుష్ప ది రైజ్‌కు ద‌క్కిన అరుదైన గౌర‌వంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version