Site icon NTV Telugu

Allu Arjun – Atlee : అల్లు అర్జున్ – అట్లీ సినిమా నుంచి కొత్త అప్‌డేట్..

Mrunal Tagur Allu Arjun Atle

Mrunal Tagur Allu Arjun Atle

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న ఎక్సైట్మెంట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్, అప్‌డేట్స్ బయటకు వచ్చినా, ప్రతి కొత్త సమాచారం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్ పూర్తయ్యాక జాన్వీ కపూర్ సెట్లో జాయిన్ అవ్వనుందని కూడా తెలుస్తోంది. అదే సమయంలో పూజా హెగ్డే కోసం ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read : Trivikram – Venkatesh : త్రివిక్రమ్‌ – వెంకటేశ్‌ హిట్ కలయికకు మరో స్టార్ హీరోయిన్‌!

దీపికా పదుకోన్ కూడా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, అల్లు అర్జున్ యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా ఉండబోతున్నాయని చెబుతున్నారు. బన్నీ కోసం అట్లీ ప్రత్యేకంగా ఓ పవర్‌ఫుల్ మాస్ రోల్ డిజైన్ చేశాడట. ఈ కథ మొత్తం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఒక డాన్ చుట్టూ తిరుగుతుందనే సమాచారం వచ్చింది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ విలువలు, టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమా రూపొందిస్తున్నారట. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అట్లీ ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక గెస్ట్ రోల్స్ ప్లాన్ చేశాడని సమాచారం. ఆ రోల్స్ కోసం పెద్ద స్టార్‌లను అప్రోచ్ అవుతున్నాడట. మొత్తంగా చెప్పాలంటే, ఈ అల్లు అర్జున్ – అట్లీ కాంబో సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఒక భారీ మాస్ ఎంటర్‌టైనర్‌గా రానుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Exit mobile version