Allu Arjun Atlee Movie: ష్.. అంతా గప్ చుప్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెన్సేషనల్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#AA22) ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రేపు బుధవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే, ఈ ప్రకటన వెనుక అట్లీ నడుపుతున్న ‘సీక్రెట్ ఆపరేషన్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఏదైనా సినిమా అప్‌డేట్ రావడానికి ముందే లీకులు రావడం సహజం. కానీ, ఈ సినిమా విషయంలో అట్లీ అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ ఏంటనేది కేవలం అల్లు అర్జున్, అట్లీలకు తప్ప మరెవ్వరికీ తెలీదు. ఆఖరికి బన్నీ సొంత పీఆర్ టీమ్‌కు కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారట. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి కేవలం పది నిమిషాల ముందు మాత్రమే కంటెంట్ షేర్ చేస్తానని అట్లీ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read : Peddi : ఎప్పుడు వచ్చినా టెన్షన్ లేదు!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇప్పటివరకు అయితే ఫిల్మ్ ఛాంబర్‌లో పుష్ప సినిమాలో బాగా వైరల్ అయిన’వైల్డ్ ఫైర్’ అనే టైటిల్ రిజిస్టర్ అయి ఉండటంతో, బన్నీ సినిమా పేరు ఇదేనంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. అంతేకాక అయాన్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. అయితే, ఈ టైటిల్‌కు, అట్లీ సినిమాకు అసలు సంబంధం ఉందా? లేదా అనేది రేపటి వరకు సస్పెన్సే. మరోవైపు బన్నీ వాసు, ఎస్‌కేఎన్ వంటి సన్నిహితులు ట్విట్టర్‌లో హింట్లు ఇస్తూ ఫ్యాన్స్‌లో హైప్ పెంచుతున్నారు. కానీ అసలు నిజం ఏంటంటే.. వీరికి కూడా టైటిల్ విషయంలో క్లారిటీ లేదని సమాచారం. కేవలం టైటిల్ అనౌన్స్‌మెంట్ మాత్రమే కాకుండా, ఒక పవర్‌ఫుల్ ప్రీ-లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ పోస్టర్ ఉండబోతుందని సమాచారం. ఇప్పటివరకు ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా ఇంత జాగ్రత్త పడుతున్నారంటే, టైటిల్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఏదో పెద్ద షాక్ ఇవ్వబోతున్నారని అర్థమవుతోంది. బన్నీ వెండితెరపై మళ్ళీ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో తెలియాలంటే రేపు ఉదయం 11 గంటల వరకు ఆగాల్సిందే!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!