Site icon NTV Telugu

AA22 : అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. రిలీజ్ డేట్ లాక్

Aa 22

Aa 22

పుష్ప2 సినిమాతో  పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్  చేసేసాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. ఇండియన్ సినిమా హిస్టరీలో గత చిత్రాల తాలూకు రికార్డ్స్ బద్దలు కొడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Also Read : Mohan Lal : మలయాళ సినీ చరిత్రలో మోహన్ లాల్ సంచలనాలు

కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్ చేయనున్నారు. ఇప్పుడు ఈ  సినిమాకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ ఎంతగానో  ఎదురుచూస్తున్న AA22 సినిమాను 2027 పొంగల్ కు గ్రాండ్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబర్ లో  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందట. ఆ తర్వాత సీజీ వర్క్ కారణంగా ఏడాది పొడవునా షెడ్యూల్ ప్లానింగ్ చేస్తున్నారు. రాబోయే 6 నెలలు ప్రీ-ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసేలా ప్లాన్ రెడీ చేస్తోంది యూనిట్. అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమాలోని న్యూ లుక్ కోసం మేకోవర్ అయ్యేందుకు కఠినమైన శిక్షణలో శిక్షణలో పాల్గొంటున్నాడు. అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్  లో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ లో కనిపిస్తాడని టాక్.

Exit mobile version