Raaka: బన్నీ ‘రాకా’ పెద్ద స్కెచ్చే.. కానీ ‘శక్తి’ పోట్లు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి కానీ తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ‘రాకా’, అందులో బన్నీ ఊహించని డీ-గ్లామరైజ్డ్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ చర్చకు దారితీసింది. స్టైలిష్ స్టార్‌గా పిలవబడే అల్లు అర్జున్‌ను అట్లీ Rawగా, మురికి పట్టిన దుస్తులు, గుండు, చెదిరిన జుట్టుతో చూపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ డీ-గ్లామరైజ్డ్ అవతార్‌పై కొందరు “అట్లీ ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడు” అని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం బన్నీని ఇలా చూడలేకపోతున్నామంటూ మిశ్రమంగా స్పందిస్తున్నారు.
అయితే ‘రాకా’ అనే పేరు వినగానే నెటిజన్లు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో భారీ డిజాస్టర్‌గా నిలిచిన ‘శక్తి’ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. అందులో విలన్ పేరు ‘రాకా’ కావడంతో, యాంటీ ఫ్యాన్స్ ఆ పాత ఫ్లాప్ రిఫరెన్స్‌లను బయటకు తీసి ట్రోల్ చేయడం ప్రారంభించారు ఈ దెబ్బకు సోషల్ మీడియాలో ‘శక్తి’, ‘మెహర్ రమేష్’ వంటి హ్యాష్ ట్యాగ్‌లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అయితే తమ హీరో లుక్‌ను, టైటిల్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ అల్లు అర్జున్ అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. “అక్కడ ఉన్నది అట్లీ.. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య” అని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి విలన్ పేరు పెట్టినంత మాత్రాన సినిమా రిజల్ట్ మారిపోదని, ఇది సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని వారు వాదిస్తున్నారు. అయితే ఈ ‘రాకా’ ట్రోలింగ్ బన్నీ సినిమాకు నెగటివ్ అవుతుందా లేక పబ్లిసిటీగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి!
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!