Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడుగా విన్ అయ్యాడా.. ? అంటే అయ్యే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. నేడు 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన చేయనున్న విషయం తెల్సిందే.
సాయంత్రం 5 గంటలకు జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపికైన చిత్రాల వెల్లడించనున్నారు. 2021లో సెన్సార్ అయిన చిత్రాలకు 69వ జాతీయ పురస్కారాలు అందజేయనున్నారు. ఇక గతేడాది.. బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా కలర్ ఫోటో సినిమా జాతీయ అవార్డు ను అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఉత్తమ చిత్రంగా ఆకాశమే నీ హద్దురా.. ఉత్తమ నటుడుగా సూర్య.. ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మొట్ట మొదటి సారి అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక అయ్యాడు. 69 ఏళ్లలో మొట్ట మొదటిసారి ఒక తెలుగు హీరో ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
National Film Awards 2023 live updates: బెస్ట్ యాక్టర్ రేసులో దూసుకుపోతున్న అల్లు అర్జున్!
పుష్ప.. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా. ఈ సినిమా కోసం బన్నీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021.. డిసెంబర్ 17 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. అప్పటివరకు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ను పుష్ప ఐకాన్ స్టార్ గా మార్చింది. ఈ సినిమాలో బన్నీ.. డీ గ్లామర్ రోల్ లో కనిపించాడు. ఆ రోల్ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. ముఖ్యంగా ఆ భుజాన్ని పైకి పెట్టి ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. షూటింగ్ లో ఎక్కువసేపు అలా పెట్టడం వలన బన్నీ బుజం నొప్పితో ఎన్నోరోజులు బాధపడ్డాడు. ఆ కష్టం ఊరికే పోలేదు. పుష్ప పాన్ ఇండియా లెవెల్లో రూ. 350 కోట్లు కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో పుష్పాగాడి రూల్ నే నడిచింది. ఇక ఇంత కష్టానికి ఈ జాతీయ అవార్డు రావడంలో అతిశయోక్తి లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆయన నటన.. ఆ ఇంటెన్స్.. ఆ లుక్.. సినిమా కోసం బన్నీ పడే తపనకు ఉత్తమ నటుడుగా ఎంపిక అవ్వడం అద్భుతం. ఇక ఈ అవార్డు బన్నీకి రావడం కరెక్ట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.
