NTV Telugu Site icon

Allu Arjun: ప్రభాస్ డైరెక్టర్ తో ఐకాన్ స్టార్… రచ్చలేపే కాంబినేషన్

Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. పుష్ప ది రైజ్ సినిమాతో 350 కోట్లు రాబట్టిన అల్లు అర్జున్, ఈసారి పుష్ప 2 సినిమాతో టాప్ 5 రికార్డ్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న నెక్స్ట్ సినిమా ఏంటి అన్ పక్కాగా సమాధానం చెప్పలేని పరిస్థితి. బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సినిమా ఉందని, కొరటాల శివతో ఇప్పటికే అనౌన్స్ అయిన సినిమా స్టార్ట్ చేస్తాడని, ఈ ఇద్దరూ కాదు త్రివిక్రమ్ తోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఉంటుందని, ఐకాన్ ఫిల్మ్ కూడా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని… ఇలా ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతున్నారు కానీ అఫీషియల్ గా అల్లు అర్జున్ నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తూ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాని సందీప్ రెడ్డి వంగతో అనౌన్స్ చేశాడు.

టీ-సీరీస్ అఫీషియల్ గా ప్రకటించిన ఈ అనౌన్స్మెంట్ ఒక క్రేజీ సినిమాని పునాది అనే చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి, ప్రస్తుతం రణబీర్ కపూర్ తో ‘అనిమల్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ అయిపోగానే సందీప్ రెడ్డి వంగ-ప్రభాస్ కాంబినేషన్ లో ‘స్పిరిట్’ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. స్పిరిట్ అయిపోయిన వెంటనే అల్లు అర్జున్-సందీప్ రెడ్డి వంగ సినిమా స్టార్ట్ అవ్వనుంది. అయితే పుష్ప 2 అయిపోయే సమయానికి సందీప్, అనిమల్ షూటింగ్ ని మాత్రమే పూర్తి చేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా ఉంది కాబట్టి స్పిరిట్ అయ్యాకే అల్లు అర్జున్ సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈలోపు అల్లు అర్జున్ వేరే ఎవరైనా డైరెక్టర్ తో సినిమా చేస్తాడేమో చూడాలి.

Show comments