Site icon NTV Telugu

Allu Arjun – Trivikram: మాస్ మసాలా కాంబో సెట్టు.. ఇక ప్రకటనే లేటు!

Allu Arjun Trivikram Fourth

Allu Arjun Trivikram Fourth

Allu Arjun and Trivikram’s film to be announced: అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం కూడా ఇదే రకమైన ప్రచారం జరగగా అల్లు అర్జున్, శ్రీ లీల కాంబినేషన్లో త్రివిక్రమ్ ఒక ఆహా యాప్ కి సంబంధించిన ప్రమోషనల్ వీడియో చేశారు. ఇక ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలిసి సినిమా చేయబోతున్నట్టు దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలిసి జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో లాంటి హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. ఈ నేపధ్యంలో తదుపరి సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది.
Social Media : జాగ్రత్త బాసూ.. నేటి పోస్టే రేపు కాలనాగై కాటేసునేమో?
ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత నాగవంశీ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. త్వరలోనే ఒక మంచి ప్రకటన రాబోతుందంటూ ఆయన కామెంట్ చేశారు. మరోసారి రీ యునైట్ అవుతున్నామంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుతానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఎందుకో కానీ అనేకమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇక మరోపక్క అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇక వీరిద్దరి సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Exit mobile version