2024లో ఇండియాలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ 3లో వినిపించే పేరు ‘పుష్ప ది రూల్’. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బ్రెయిన్ లో నుంచి వచ్చిన ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ కింగ్ పిన్ పుష్ప క్యారెక్టర్ ని పాన్ ఇండియా ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ సెలబ్రిటీస్ కూడా ఫిదా అయ్యారు. పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మ్యానరిజమ్స్, డాన్స్ స్టెప్స్, డైలాగ్స్ ని చిన్న పిల్లల నుంచి డేవిడ్ వార్నర్ వరకూ ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యారు. అంతలా మాస్ హిస్టీరియా క్రియేట్ చేసిన పుష్ప ది రూల్ సినిమా ఇండియాలో 350 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు పార్ట్ 1కి సీక్వెల్ గా పుష్ప ది రైజ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇటివలే వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న పుష్ప ది రైజ్ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది.
అల్లు అర్జున్ పైన కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ కి సుకుమార్ ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తున్నాడు. ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని కూడా హైదరాబాద్ షెడ్యూల్ లో షూట్ చెయ్యడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటి రెండు నెలలు గడుస్తున్నా పుష్ప ది రూల్ గురించి ఎలాంటి అప్డేట్ బయటకి రాకపోవడంతో అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో అప్డేట్ కావాలి అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చెయ్యకపోవడంతో బన్నీ ఫాన్స్, గీత ఆర్ట్స్ ఆఫీస్ ముందు ధర్నాలు కూడా చేశారు. అభిమానులు ఇంత చేస్తున్నా అల్లు అర్జున్ అండ్ టీం మాత్రం కామ్ బిఫోర్ ది స్ట్రోమ్ అన్నట్లు సైలెంట్ గా పుష్ప ది రూల్ షూటింగ్ చేసేస్తున్నారు.
