Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ చాలా చాకచక్యంగా వ్యవరిస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకపోయినా.. చిన్న వాటితోనే లాభాల పంట పండిస్తున్నారు. సొంత నిర్మాణంలో చేసినవాటితోనే కాకుండా.. పక్క భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి మరిన్ని లాభాలు అందుకుంటున్నారు. అల్లు అరవింద్ కు ముందు చూపు ఉన్న నిర్మాతగా పేరుంది. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ ను ఎంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. రీసెంట్ టైమ్స్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అన్నీ హిట్లే ఉన్నాయి.
Read Also : Mass Jathara : మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్స్
నాగచైతన్యతో తండేల్ తో వంద కోట్ల సినిమా అందుకున్నారు. దాని తర్వాత శ్రీ విష్ణుతో సింగిల్ మూవీ తీసి మంచి లాభాలు అందుకున్నారు. తాజాగా మహావతార్ నరసింహా మూవీని తెలుగులో రిలీజ్ చేసి మంచి లాభాలు అందుకున్నారు. కన్నడలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు అల్లు అరవింద్. పెద్ద బడ్జెట్ సినిమాలు తీసి రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అవి ప్లాప్ అయితే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అదే చిన్న బడ్జెట్ తో తీస్తే ఒకవేళ ప్లాప్ అయినా పెద్ద నష్టాలు ఉండవు. హిట్ అయితే డబుల్ లాభాలు వస్తున్నాయి. ఇలా అల్లు అరవింద్ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు.
Read Also : Baahubali : బాహుబలి నుంచి స్పెషల్ వీడియో.. ప్రభాస్ అల్లరి..
