K. Raghavendra Rao: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లెజెండరీ డైరెక్టర్స్ లో కె. రాఘవేంద్రరావు బిఎ ఒకరు. స్టార్ హీరోలకు హిట్లు ఇవ్వడానికే ఆయన డైరెక్టర్ గా మారారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఇక రాఘవేంద్రరావు అంటే హీరోయిన్లు, పూలు, పండ్లు, బొడ్డు, యాపిల్.. ఆయన ప్రతి సినిమాలో ఇలాంటి సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఆ సాంగ్ లేనిదే అది రాఘవేంద్రరావు సినిమానే అనిపించుకోదు. ముఖ్యంగా రాఘవేంద్రరావు.. సురేష్ ప్రొడక్షన్స్, గీతా ఆర్ట్స్ లోనే ఎక్కువ సినిమాలను తీశాడు. ఇక ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ను ఒక్కటిగా చేసింది అన్ స్టాపబుల్ 2 . నందమూరి తారక రామారావు శతదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలకృష్ణ నలుగురు లెజెండ్స్ ను కొత్త ఎపిసోడ్ కు పిలిచాడు.
నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, డైరెక్టర్ రాఘవేంద్రరావు తో సందడి చేసారు. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. రావడం రావడమే రాఘవేంద్రరావు సురేష్ బాబు, అల్లు అరవింద్ ను ఆడేసుకున్నారు. “40 ఏళ్లుగా వీరిద్దరి మధ్య సాండ్ విచ్ లా మారాను. ఇప్పుడు కూడా వీరిద్దరి మధ్యనేనా” అంటూ కౌంటర్ వేశారు. ఇక అల్లు అరవింద్ సైతం రాఘవేంద్రరావు పై జోకులు వేశారు. “రాఘవేంద్రరావు బిఎ అంటే ఏంటో తెలుసా.. రాఘవేంద్రరావు బొడ్డు మీద యాపిల్”అంటూ చమత్కరించారు. న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు. నేను ఎక్కడ పడాలో కనిపెట్టాను అంటూ రాఘవేంద్రరావు చెప్పి ఆ నేమ్ కు జస్టిఫై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
https://www.youtube.com/watch?v=95C501gnKtI
