NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ తో ముగిసిన నిర్మాతల సమావేశం.. టికెట్ రేట్లపై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్

Tollywood Producers Meeting

Tollywood Producers Meeting

Tollywood Producers Met Deputy Cm Pawan Kalyan: విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో సినీ నిర్మాతల సమావేశం ముగిసింది. అరగంట పాటు కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలను నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఇక భేటీ అనంతరం సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ మా అందరికీ ఆనందం కలిగించిన రోజని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సమయం ఇస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం వచ్చి అభినందిస్తామని అడిగామని అందుకు సమయం కేటాయిస్తామని పవన్ హామీ ఇచ్చారని అన్నారు.

Rakul Preet Singh: 250 కోట్ల అప్పుల ఊబిలో రకుల్ ప్రీత్ సింగ్ భర్త.. షాకింగ్ నిర్ణయం!

ఇక టికెట్ రేట్ సమస్య అనేది పెద్ద విషయం కాదన్న ఆయన సినీ పరిశ్రమ సమస్యలపై పూర్తి స్థాయిలో రిప్రజెంటేషన్ త్వరలో ఇస్తామని అన్నారు. సినిమా టికెట్ రేట్లు వారం రోజుల పెంపుతో పాటు సినీ పరిశ్రమ, థియేటర్ల సమస్యలు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఏపీలో సినిమా రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చ జరిపినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశానికి నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ , నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు హాజరైన సంగతి తెలిసిందే.

Show comments