Site icon NTV Telugu

VarunLuv: అసలు ఈ పెళ్లి జరగడానికి కారణమైనవాడే మిస్ అయ్యాడేంటి.. ?

Allu

Allu

VarunLuv: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ – లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ జంట ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో లావణ్య తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసు గెలిచిన లావణ్య.. ఆ తరువాత వరుణ్ తో కలిసి మిస్టర్ అనే సినిమాలో నటించింది. అదే సినిమా సెట్ లో వీరిద్దరి పరిచయం.. కొద్దిరోజులకే ప్రేమగా మారింది. ఇక ఈ సినిమా తరువాత మరో సినిమాలో నటించింది లేదు. కనీసం వీరిద్దరూ బయట కూడా ఎక్కడా బయటపడలేదు. వీరి ప్రేమ గురించి బయటపెట్టిన రోజు.. వారి ప్రేమ వార్త కన్నా.. అల్లు అరవింద్ పేరు మారుమ్రోగిపోయింది. అందుకు కారణం.. అల్లు అరవింద్ ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లావణ్య మాట్లాడుతుండగా మధ్యలో మైక్ అందుకున్న అల్లు అరవింద్.. ‘ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు చక్కగా మాట్లాడుతోంది. ఇక్కడే ఒక కుర్రోడిని చూసి పెళ్లి చేసుకుని సెటిల్ అయితే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చాడు.

Duet: చిన్న కొండన్న.. ఇది కూడా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీనేనా..?

ఇక అదే మాటను లావణ్య నిజం చేసింది. అల్లు అరవింద్ చెప్పిన మాట తరువాతే లావణ్య – వరుణ్ ప్రేమాయణం బయటపడింది. నిజం చెప్పాలంటే.. వీరి పెళ్లి జరగడానికి కారణం అంటే మొదట అల్లు అరవింద్ పేరే చెప్పుకోవాలి. అలాంటి అరవింద్.. వరుణ్ – లావణ్య పెళ్ళిలో కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. అల్లు అరవింద్ పెళ్లికి వెళ్లలేదని తెలుస్తోంది. ఏ పెళ్లి ఫొటోలో కూడా అల్లు అరవింద్ కనిపించలేదు. ఎంగేజ్ మెంట్ లో సందడి చేసిన అల్లు అరవింద్.. పెళ్ళిలో ఎందుకు కనిపించలేదు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.

Exit mobile version