Site icon NTV Telugu

Allu Aravind : మెగా హీరోతో కేజీఎఫ్ లాంటి మూవీ…

allu aravind

allu aravind

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని” థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘గని’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. వరుణ్ తేజ్ తో ‘కేజీఎఫ్’ వంటి సినిమా చేయాలని ఉంది అంటూ తన కోరికను వ్యక్తం చేశాడు.

Read Also :  Malaika Arora : కార్ యాక్సిడెంట్… స్టార్ హీరోయిన్ కు గాయాలు

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా బాలీవుడ్‌ నటి సాయి మంజ్రేకర్‌ నటిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నరేష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ మ్యూజిక్ అందించారు.

Exit mobile version